For Money

Business News

నిఫ్టికి ఐటీ అండ

సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. నిఫ్టి ఇపుడు 18472 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 82 పాయింట్ల లాభంతో ఉంది. సెన్సెక్స్ కూడా 288 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. చాలా రోజుల తరవాత దిగువ స్థాయిలో ఐటీ షేర్లకు మద్దతు లభిస్తోంది. అలాగే మిడ్ క్యాప్‌ సూచీ కూడా రాణిస్తోంది. ఇవాళ ప్రధాన సూచీలన్నీ అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. ఇవాళ నిఫ్టిలో హెచ్‌సీఎల్ టెక్‌ ఒక శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. టెక్‌ మహీంద్రా కూడా ఒక శాతం దాకా లాభంతో ఉంది. నిఫ్టిలో ఇపుడు 47 షేర్లు లాభాల్లో ఉన్నాయి. అదానీ షేర్లు కూడా ఇవాళ వెలుగులో ఉన్నాయి. ఈ సూచీలో కూడా దాదాపు అన్ని షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఎల్‌టీ టీఎస్‌, లారస్‌ ల్యాబ్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందన్న వార్తలతో కొన్ని ఫార్మా షేర్లు వెలుగులో ఉన్నాయి. అలాగే టెస్టింగ్‌ ల్యాబ్‌ అయిన డాక్టర్‌ పాత్‌ ల్యాబ్‌ షేర్‌ కూడా గ్రీన్‌లో ఉంది. బ్యాంక్‌ నిఫ్టిలో బంధన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. సూచీలోని 12 షేర్లూ గ్రీన్‌లో ఉన్నాయి.