ట్రై కలర్‌పై ఐటి దాడులు…
హైదరాబాద్ కేంద్రంగా ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ట్రై కలర్ కంపెనీపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం నుంచి దేశవ్యాప్తంగా 16 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో 10 ప్రాంతంలో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, పాట్నా ఢిల్లీ బెంగళూరు చెన్నై సహా పలు నగరాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. విదేశాల్లో కూడా ఈ కంపెనీ పెద్ద ఎత్తున ప్రాపర్టీ బిజినెస్ చేస్తోంది. ట్రై కలర్ సంస్థలో భారీగా నగదును ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.