For Money

Business News

ఇండిగో బంపర్‌ ఆఫర్‌

ఎయిర్‌లైన్స్‌ కంపెనీ ఇండిగో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘స్వీట్‌ 16’ పేరిట వార్షికోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఇది కేవలం దేశీయ విమాన సర్వీసులకు మాత్రమే వర్తిస్తుంది. ఆఫర్‌ కింద రూ.1,616 (పన్నులతో కలిపి) ప్రారంభ ధరకే టికెట్‌ను కొనుగోలు చేయొచ్చని కంపెనీ తెలిపింది. ఆగస్టు 3 నుంచి 5 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులోఉంటుందని పేర్కొంది. టికెట్‌ కొనుగోలు చేసిన వారు 2022 ఆగస్టు 18 నుంచి 2023 జులై 16 మధ్య ప్రయాణం చేయొచ్చు. ఈ ఆఫర్‌ కింద హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్‌ కార్డుతో టికెట్‌ కొనుగోలుచేసే వారికి 5 శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తామని ఇండిగో ప్రకటించింది. అంటే కనీసం రూ.3,500 బుకింగ్‌పై గరిష్ఠంగా రూ.800 వరకు క్యాష్‌ బ్యాక్‌ వస్తుంది.