For Money

Business News

రూ.1000 కోట్ల బోగస్‌ ఖర్చులు చూపారు?

ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు ప్రముఖ టూవీలర్‌ కంపెనీ హీరో మోటొకార్ప్‌పై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. కంపెనీ సుమారు రూ. 1000 కోట్ల మేరకు బోగస్‌ ఖర్చులను చూపినట్లు ఐటీ అధికారులు కనుగొన్నారు. ఆదాయపు పన్ను ఎగ్గొట్టానికి ఇలా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కంపెనీకి చెందిన హార్డ్‌ కాపీలు, డిజిటల్‌ డేటాను పరిశీలించిన ఐటీ అధికారులు రూ. 1000 కోట్ల మేర ఖర్చు అధికంగా చూపినట్లు తేల్చారు. ఐటీ అధికారుల నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. షేర్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌ దాదాపు ముగిసే సమయంలో ఈ వార్త మార్కెట్‌లోకి వచ్చింది. 3.15 గంటలకు అంటే స్క్వేర్‌ ఆఫ్‌ పూర్తవుతున్న సమయంలో ఈ వార్త బ్రేక్‌ కావడంతో కంపెనీ తీవ్రంగా స్పందించింది. కంపెనీ షేర్‌ బీఎస్‌ఈలో 7.18 శాతం క్షీణించి రూ. 2,206కు పడింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 2154కు క్షీణించినా .. కోలుకుని రూ. 2219 వద్ద ముగిసింది.