For Money

Business News

LIC షేర్‌ను ఇపుడు కొనొచ్చా?

ఎల్‌ఐసీ షేర్‌ ఇవాళ కూడా భారీగా క్షీణించి రూ. 722కు క్షీణించింది. ఈ షేర్‌ను రూ. 945 ధరకు ఆఫర్‌ చేసి..ఆ ధర ఇప్పటి వరకు రాలేదు. ఈ షేర్‌ ఓపెనింగ్‌ రోజు రూ.918.95ని తాకగా… అప్పటి నుంచి పడుతూనే వస్తోంది. ఇపుడు ఆల్ టైమ్‌ కనిష్ఠ స్థాయికి చేరింద. ఇవాళ రూ. 722ని తాకింది. ప్రైవేట్‌ కంపెనీలతో పోలిస్తే ఎల్‌ఐసీ పనితీరు ఆశాజనకంగా లేకపోవడం వల్ల ఈ షేర్‌లో ఒత్తిడి పెరుగుతోంది. అయితే చిన్న చిన్న కంపెనీలతో ఎల్‌ఐసీని పోల్చడం వల్ల ఎల్‌ఐసీపై ఆసక్తి తగ్గుతోంది. చూస్తుంటే ప్రైవేట్‌ బీమా కంపెనీల షేర్ల ధరలను పెంచేందుకే ఎల్‌ఐసీని లిస్ట్‌ చేశారా అన్న అనుమానం కల్గుతోంది. అయితే ఎస్‌బీఐ లైఫ్‌ ఈ రంగంలో నంబర్‌ వన్‌ షేర్‌గా అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ఎల్‌ఐసీ షేర్‌ సరైన ధర రూ.700గా చాలా మంది అనలిస్టులు అంటున్నారు. దాదాపు ఆ స్థాయికి ఎల్‌ఐసీ షేర్‌ చేరినట్లే. నిఫ్టి కూడా 16000కు మించి పడకపోవచ్చని.. 16200 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు వస్తుందని అంటున్నారు. అలాగే ఎల్ఐసీ షేర్‌ కూడా మహా అయితే రూ. 700 దాకా వెళుతుందని…అక్కడి నుంచి రివర్సల్‌ మొదలవుతుందని భావిస్తున్నారు. కొన్ని బ్రోకింగ్ సంస్థలు ఎల్‌ఐసీ టార్గెట్‌ను రూ. 875గా పేర్కొన్నారు.సో.. దీర్ఘ కాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఇష్టపడే వారికి ఎల్ఐసీ ఓ మంచి షేర్‌గా చెప్పుకోవచ్చు.