IRCTCలో మరో 5 శాతం వాటా అమ్మకం
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)లో తనకున్న వాటాలో మరో 5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రేపు, ఎల్లుండి ఈ షేర్లను అమ్ముతారు. ఈ ఆఫర్ కనీస ధర రూ. 680గా పేర్కొంది. ఇవాళ్టి ధర అంటే రూ. 734.90తో పోలిస్తే 7 శాతం తక్కువ. 4 కోట్ల వరకు షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేస్తోంది. ఇది కంపెనీ మొత్తం పెయిడ్ అప్ ఈక్విటీలో 0.5 శాతం వాటాకు సమానం. గురువారం పూర్తిగా నాన్ రీటైల్ షేర్లకు ఆఫర్ చేస్తారు. శుక్రవారం రీటైల్ ఇన్వెస్టర్లు ఆఫర్‌కు బిడ్ చేయొచ్చని ప్రభుత్వం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ ఫర్ సేల్‌లో 25 శాతం షేర్లు మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలకు, పది శాతం రీటైల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్నారు. కనిష్ఠ ధర వద్ద లెక్కిస్తే సుమారు రూ. 2720 కోట్లను కేంద్రం సమీకరించనంది.