For Money

Business News

మరో రూ. 78 కోట్ల హీరా గ్రూప్‌ ఆస్తుల జప్తు

హీరా గ్రూప్‌నకు చెందిన మర రూ. 78.63 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద వీటిని జప్తు చేసినట్లు వెల్లడించింది.ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ ఏ బిల్డర్స్‌ అండ్‌ బిల్డర్స్‌ అనే కంపెనీకి చెందినరూ. 37.58 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. సలార్‌పురియా గ్రూప్‌నకు చెందిన నీలాచల్‌ టెక్నోక్రాట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా చేరిన రూ. 41.05 కోట్లను ఎస్‌ ఏ బిల్డర్స్‌కు చెందిన సయ్యద్‌ అఖ్తర్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ పేర్కొంది. తిరుపతికి చెందిన నౌహెరా షేక్‌ ప్రజల నుంచి రూ. 5000 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసి… అసలు కూడా ఇవ్వకుండా మోసం చేసిన విషయం తెలిసిందే. ఈమెపై 2018లో ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌లో ఆస్తులు కొనేందుకు SA బిల్డర్స్ అండ్‌ బిల్డర్స్‌కు నౌహెరా షేక్‌ రూ. 148 కోట్లను బదిలీ చేశారు. వీటిలో కేవలం రూ. 70 కోట్లకు ఆస్తులను రిజిస్టర్‌ చేశారు. మిగిలిన రూ. 78 కోట్లలలో కొంత మొత్తాన్ని ఎస్‌ఏ బిల్డర్స్‌ వద్ద దాచి పెట్టారు. ఇందులో ఉంచి రూ. 41 కోట్లను నీలాచల్‌ టెక్నోక్రాట్స్‌కు బదిలీ చేయగా, మిగిలిన మొత్తాలను షిల్లాంగ్‌, కోల్‌కతా కేంద్రంగా ఉన్న నాలుగు సూట్‌కేస్‌ కంపెనీలకు తరలించారు. ఆ సూట్‌కేస్‌ కంపెనీలు సలార్‌పూరియ సత్వ గ్రూప్‌కు రుణం రూపంలో చెల్లించాయని ఈడీ పేర్కొంది. నవంబర్‌లో జరిగిన దాడుల్లో ఈ మొత్తాలు బయటపడ్డాయి. దీంతో రూ. 78 కోట్ల సమాన మైన ఆస్తులను, నగదును జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది.