For Money

Business News

ఐఓసీ లాభం రూ.6,360 కోట్లు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వాయింపు ఏ స్థాయిలో ఉందంటే ఇటు కేంద్రం, అటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు కూడా లాభాల పంట పండుతోంది. అన్ని ఖర్చులూ, పన్నులు పోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) రూ.6,360.05 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.6,227.31 కోట్లతో పోల్చితే చాలా స్వల్పంగా పెరిగింది. తొలి త్రైమాసికం లాభం రూ.5,941.37 కోట్లతో పోల్చితే మాత్రం బాగా పుంజుకుంది. కంపెనీ ఆదాయం 46 శాతం వృద్ధి చెంది రూ.1.69 లక్షల కోట్లకు చేరుకుంది. ఒక్కో షేరుపై రూ.5 మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు కంపెనీ బోర్డు ప్రతిపాదించింది.