For Money

Business News

జీపై ఇన్వెస్కో పిటీషన్‌

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రధాన వాటాదారు ఇన్వెస్కో కోర్టుకు ఎక్కింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అసాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఓఎఫ్‌ఓ గ్లోబల్‌ చైనా ఫండ్‌తో కలిసి ఇన్వెస్కో డెవలపింగ్‌ మార్కెట్స్‌ ఫండ్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఈ రెండు సంస్థలకు కలిపి 17.88 శాతం వాటా ఉంది. తమ ఈజీఎం కోసం ఇచ్చిన నోటీసును పట్టించుకోకుండా సోనీ పిక్చర్స్‌తో డీల్‌ కుదుర్చుకోవడంతో ప్రధాన వాటాదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఇన్వెస్కో పిటీషన్‌ గురువారంనాడు విచారణకు రానుంది.