For Money

Business News

చర్చ లేకుండా బీమా సంస్థల ప్రైవేటీకరణ బిల్లుకు ఆమోదం

పెగసస్‌పై చర్చకు పార్లమెంటులో విపక్షాలు పట్టుపడుతున్నాయి. దీంతో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఈలోగా లోక్‌సభలో విపక్ష సభ్యుల నినాదం మధ్యే సాధారణ బీమా సంస్థల్లో ప్రభుత్వ తన వాటాను అమ్మేందుకు ఉద్దేశించిన ద జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) అమెండ్‌మెంట్‌ బిల్ 2021ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. ఇవళ ఎలాంటి చర్చ లేకుండా ఈ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఇపుడున్న చట్ట ప్రకారం సాధారణ బీమా కంపెనీల్లో ప్రభుత్వం కచ్చితంగా 51 శాతం వాటా కలిగి ఉండాలి. ఈ నిబంధనను తాజా సవరణతో తొలగించారు. అంటే వీటిపై ప్రభుత్వ యజమాయిషీ పోతుంది. మరోవైపు ఎల్‌ఐసీలో కూడా వాటా విక్రయించడానికి ప్రభుత్వం సిద్ధమౌతోంది.