అలాంటి వారిని తొలగించాం
మూన్‌లైటింగ్ (ఒకేసారి రహస్యంగా రెండు కంపెనీల్లో పనిచేసేవారు) చేస్తున్న ఉద్యోగులను తాము కూడా గుర్తించి తొలగించాని ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీస్ పరేఖ్ తెలిపారు. కంపెనీ రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మూన్‌లైటింగ్ అనైతికమని అన్నారు. అలా చేస్తే కంపెనీలో గోప్యత ఎక్కడ ఉంటుందని ఆయన అన్నారు. తాము ఉద్యోగులను తొలగించిన మాట నిజమేనని చెప్పిన సలీల్… ఎంత మందిని తొలగించారో మాత్రం చెప్పలేదు. ఉద్యోగులు ఒక కంపెనీలో పనిచేస్తున్నపుడు ఆ కంపెనీకి సంబంధించిన గోప్యంగా ఉంచే పలు అంశాలను షేర్ చేసుకుంటామని.. అతను మరో కంపెనీలో పనిచేస్తే.. అతనిపై నమ్మకం ఎలా ఉంటుందని ఆయన అన్నారు. కొత్త నైపుణ్యాలు, అంశాలు తెలుసుకునేందుకు ఒక ఉద్యోగం చేస్తూ.. కొత్త ఉద్యోగాలు చేయాల్సి వస్తే… కంపెనీ అనుమతి తీసుకుని చేయాలని ఆయన అన్నారు.