For Money

Business News

మిడ్‌ సెషన్‌లో సీన్‌ రివర్స్‌

భారీ నష్టాలతో ప్రారంభమైన వాల్‌స్ట్రీట్‌లో మిడ్‌ సెషన్‌కల్లా సీన్‌ మారిపోయింది. వరుసగా అమ్మకాలు జరుగుతుండటంతో… అసలు అమ్మేవారే లేనట్లుగా పరిస్థితి తయారైంది. దీంతో భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. ఈ స్థాయిలో వచ్చిందంటే రెండు వాతం నష్టాల్లో ఉన్న సూచీలు రెండు శాతం లాభాల్లోకి వచ్చాయి. ఆరంభంలో మూడు శాతం దాకా నష్టపోయిన నాస్‌డాక్‌ ఏకంగా రెండు శాతంపైగా లాభంతో వచ్చింది. ఇక బ్యాంకింగ్‌,ఎకానమీ, మెటల్స్‌ పెరగంతో ఎస్‌ అండ్‌ పీ 500, డౌజోన్స్‌ కూడా భారీగా పెరిగాయి. దాదాపు ఒక శాతం నష్టంతో ఉన్న డౌజోన్స్‌ 2.8 శాతం లాభంలోకి రాగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ రెండు శాతం నష్టాల నుంచి రెండున్నర శాతం లాభాల్లో వచ్చింది. డాలర్‌ ఒక శాతం దాకా పడటంతో… ఈక్విటీ మార్కెట్లలో ఉత్సాం పెరిగింది. బాండ్‌ ఈల్డ్స్‌ మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. వాల్‌స్ట్రీట్‌ రికవరీతో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు కూడా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 95 డాలర్లకు చేరింది. ఇక బులియన్‌ కూడా నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి.