అమెరికాలో ఉద్యోగుల ఎంపికలో ఇన్ఫోసిస్ వివక్ష
ఉద్యోగుల ఎంపికలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వివక్ష చూపుతోందంటూ మళ్ళీ ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో ఇన్ఫోసిస్ మాజీ వైఎస్ ప్రెసిడెంట్ ప్రెజీన్ ఈ ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ లో ఇన్ఫోసిస్‌పై ఆమె పిటీషన్ దాఖలు చేశారు. భారత సంతతికి చెందినవారి, ఇంటి వద్ద పిల్లలు ఉన్న తల్లులను ఉద్యోగంలోకి తీసుకోవద్దని కంపెనీ మానవ వనరుల విభాగానికి ఇన్ఫిసిస్ పెద్దలు ఆదేశించారని ఆమె ఆరోపించారు. అలాగే 50 ఏళ్ళు దాటినవారి కూడా తీసుకోవద్దని అన్నారని పేర్కొన్నారు. ప్రిజీన్ పిటీషన్‌ను కొట్టివేయాలంటూ ఇన్ఫోసిస్ వేసిన పిటీషన్ నిన్న రాత్రి కోర్టు కొట్టివేసింది. ఉద్యోగుల ఎంపికలో ఇన్ఫోసిస్ తీవ్ర వివక్ష చూపుతోందని ఆమె ఆరోపిస్తున్నారు. కంపెనీ కోసం సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను అక్రమ పద్ధతుల్లోచేర్చుకోవాలని ఇన్ఫోసిస్ భాగస్వామ్య సంస్థలు కర్జ్, అల్బ్రైట్ కోరాయని, దానికి తాను వ్యతిరేకించానని ఆమె అన్నారు. దీంతో ఆ కంపెనీలు తనకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించాయని… తనను ఆకస్మికంగా అన్యాయంగా కంపెనీ నుంచి తొలగించినట్లు ఆమె తన పిటీషన్లో పేర్కొన్నారు.