For Money

Business News

పన్ను వసూళ్లలో 24 శాతం వృద్ధి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24 శాతం పెరిగినట్లు కేంద్ర పన్నుల విభాగం తెలిపింది. కార్పొరేట్‌ పన్నుల్లో 16.74 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో 32.30 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 మధ్య రూ.8.98 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు తెలిపింది. రీఫండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా నమోదైనట్లు పన్నుల విభాగం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.3 శాతం అధికమని పేర్కొంది. 2022-23 బడ్జెట్‌లో అంచనా వేసిన ప్రత్యక్ష పన్నుల మొత్తం దాదాపు 52.46 శాతం వసూలు చేసినట్లు పేర్కొంది. పన్ను వసూళ్లలో 24 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 24 శాతం పెరిగినట్లు కేంద్ర పన్నుల విభాగం తెలిపింది. కార్పొరేట్‌ పన్నుల్లో 16.74 శాతం, వ్యక్తిగత ఆదాయ పన్నుల్లో 32.30 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబర్‌ 8 మధ్య రూ.8.98 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు తెలిపింది. రీఫండ్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.7.45 లక్షల కోట్లుగా నమోదైనట్లు పన్నుల విభాగం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.3 శాతం అధికమని పేర్కొంది. 2022-23 బడ్జెట్‌లో అంచనా వేసిన ప్రత్యక్ష పన్నుల మొత్తం దాదాపు 52.46 శాతం వసూలు చేసినట్లు పేర్కొంది.