For Money

Business News

ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ షాక్‌

నిన్న ఇన్ఫోసిస్‌ ప్రకటించిన ఫలితాలపై మన బిజినెస్‌ మీడియా సానుకూల వార్తలను రాసింది. చాలా వరకు బిజినెస్‌ ఛానల్స్‌ తాము వేసిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉన్నాయని రాశాయి. పైగా ప్రస్తుత ఫలితాలను వొదిలి… భవిష్యత్తు అద్భుతంగా ఉండదనుందని విశ్లేషనలు. ఇక బిజినెస్‌ దినపత్రికలు సరేసరి. టీసీఎస్‌ కంటే ఇన్ఫోసిస్‌ ఫలితాలు బాగున్నాయా? ఇన్ఫోసిస్‌ జోరు టీసీఎస్‌ కంటే అధికంగా ఉందని ప్రత్యేక కథనాలు రాశాయి. అయితే ఇన్ఫోసిస్‌ ఫలితాలు ఎంత చెత్తగా ఉన్నాయో అమెరికా మార్కెట్‌ చెప్పింది. నిన్న అమెరికా మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 7.5 శాతం క్షీణించి 22.57 డాలర్ల నుంచి 20.92 డాలర్లకు చేరింది. తరవాత కోలుకుని 6 శాతం నష్టంతో 21.19 డాలర్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసిన తరవాత జరిగిన ట్రేడింగ్‌లో 21.38 వద్ద ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌ ఏడిఆర్‌ ఏడాది గరిష్ఠ స్థాయి 26.39 డాలర్లు కాగా, కనిష్ఠ స్థాయి 17.77 డాలర్లు.