For Money

Business News

నికర లాభం రూ. 1631 కోట్లు

ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ.1,631 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ .1.016 కోట్ల లాభంతో పోలిస్తే 60 శాతం అధికం. బ్యాంక్‌ ఆదాయం రూ.9,298 కోట్ల నుంచి రూ.10,113 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం 9.5 శాతం పెరిగి రూ .8.181.77 కోట్లకు చేరింది. బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) 2.88 శాతం నుంచి 2.35 శాతానికి తగ్గాయి.