బంగారంపై దిగుమతి సుంకం పెంపు
డాలర్‌తో రూపాయి బక్కచిక్కిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకొంటోంది. ముడి చమురు తరవాత బంగారం దిగుమతుల కోసం భారత్ భారీ ఎత్తున డాలర్లను వినియోగిస్తోంది. బంగారం దిగుమతులను అరికట్టేందుకు ప్రబుత్వం దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇపుడు బంగారం దిగుమతిపై 7.5 శాతం సుంకం వేస్తుండగా, దీన్ని 12.5 శాతానికి కేంద్రం పెంచింది. బంగారం దిగుమతులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మే నెలలో 107 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకోగా, జూన్‌లో ఈ దిగమతులు ఇంకా అధికంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెలలో భారత విదేశీ వాణిజ్య లోటు ఏకంగా 2429 కోట్ల డాలర్లకు చేరింది.