For Money

Business News

జీడీపీ వృద్ధి రేటు 2.6 శాతమే

కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీడీపీ వృద్ధి రేటు డేటా మొత్తం లెక్కల మాయగా కన్పిస్తోంది. ఈ ఏడాది వృద్ధి రేటు అధికంగా చూపించేందుకు గత ఏడాది డేటాను సవరించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యద్శి ఎస్‌సీ గార్గ్‌ స్పష్టం చేశారు. ఆయన ఎన్డీటీవీ ఛానల్‌లో మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో జీడీపీ రూ. 88 లక్షల కోట్లుగా వెల్లడించారు. ఇది ప్రభుత్వం పేర్కొన్న డేటానే అని వెల్లడించారు. అయితే గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ రూ. 86 లక్షల కోట్లని, ఇదే విషయాన్ని కేంద్రం గత ఏడాది ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తించారు. అయితే ఈ ఏడాది డేటా ప్రకటించే సమయంలో గత ఏడాది జీడీపీ మొత్తాన్ని రూ. 80 లక్షల కోట్లకు తగ్గించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గత ఏడాది జీడీపీ మొత్తాన్ని తగ్గించడం వల్లే ఈ ఏడాది 7.8 శాతం వృద్ధి రేటు చూపించారని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాది డేటాను సవరించకుంటే మన జీడీపీ వృద్ధి రేటు 2.6 శాతం మాత్రమేనని ఎస్‌సీ గార్గ్‌ తెలిపారు. నిజానికి పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని పరిణనలోకి తీసుకుంటే మన జీడీపీ వృద్ధి రేటు మైనస్‌లో ఉందని అనుకోవాలేమో?

Leave a Reply