For Money

Business News

మళ్ళీ పడకేసిన జీడీపీ వృద్ధిరేటు

దేశ ఆర్థిక పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (జులై నుంచి సెప్టెంబర్‌) జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికి పరిమితమైంది.అంతకుముందు త్రైమాసికంలో అంటే ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో జీడీపీ వృద్ధి రేటు 13.5 శాతంగా నమోదైంది. అంటే వృద్ధి రేటు డబుల్‌ డిజిట్‌ నుంచి సింగిల్‌ డిజిట్‌కు పడిపోయిందన్నమాట. ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో అధిక వృద్ధి రేటు ఉండటానికి కారణంగా గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ వృద్ధి రేటు బాగా దెబ్బతింది. ఆ నాటి జీడీపీ వృద్ధి రేటుతో పోల్చుకుని సంబర పడ్డాం. కాని సెప్టెంబర్‌ వచ్చే సరికి సాధారణ పరిస్థితి వచ్చేసింది. ఇక ద్వితీయార్ధంలో వృద్ధి రేటు ఇంకా తగ్గే అవకాశముంది. ఎందుకంటే ఆర్బీఐ వరుసగా వడ్డీ రేట్లను పెంచింది.