For Money

Business News

కొత్తగా 40 మంది కోటీశ్వరులు… పేదల సంఖ్య డబుల్‌

2021…భారత దేశ చరిత్ర మరువరాని ఏడాది. కరోనా మహమ్మారికి లక్షల మంది బలయ్యారు. అనేక కుటుంబాలు అనాధలయ్యాయి. మరెన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. దేశంలో పేదల సంఖ్య రెట్టింపు అయింది. అయిదే దేశంలో కొత్తగా మరో 40 మంది కోటీశ్వరులు తయరయ్యారు. గత ఏడాది దేశంలో కోటీశ్వరుల జాబితా 142కి చేరింది. అంటే 2020లో 102 మంది ఉండేవారు. కేవలం ఏడాదిలో దాదాపు 40 శాతంపైగా కొత్త కోటీశ్వరులు తయారు అయ్యారన్నమాట. దీనికి సంబంధించిన డేటాను ఆక్స్‌ఫామ్‌ దావోస్‌ రిపోర్టు వెల్లడించింది. గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 500 మంది సంపన్నులు తమ సంపదను లక్ష కోట్ల డాలర్లు మేర పెంచుకున్నారు. భారత్‌ వంటి దేశాల్లో నిరుద్యోగతం గత మేనెలలో 15 శాతానికి చేరింది. ఆరోగ్య, వైద్య రంగాలపై ఖర్చు పెట్టడానికి దేశంలోని ధనవంతులపై ఒక శాతం సర్‌చార్జి వేయాలని ఆక్స్‌ఫామ్‌
సిఫారసు చేస్తోంది. దేశంలోని పది మంది కోటీశ్వరుల సొమ్ముతో దేశంలోని పిల్ల స్కూల్‌ విద్యతో పాటు ఉన్నత విద్యను 25 ఏళ్ళ పాటు అందించవచ్చని ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది.