చైనా స్టీల్‌పై దిగుమతి సుంకం
చైనా, వియత్నాంల నుంచి దిగుమతి అవుతున్న కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించనుంది. భారత ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సుంకం 12 శాతం నుంచి 30 శాతం వరకు ఉండొచ్చని తెలుస్తోంది. దేశీయంగా స్టీల్ ఉత్పత్తులను పెంచేందుకు, దేశీయ పరిశ్రమను దిగుమతుల నుంచి కాపాడేందుకు ఈ సుంకాలు విధించనున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. చైనా, వియత్నాం నుంచి దిగుమతి అవుతున్న వెల్డెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్‌పైపులు, ట్యూబులపై ఈ సుంకాలను విధించనున్నారు. రానున్న అయిదేళ్ళపాటు ఈ సుంకాలు కొనసాగుతాయని ఈనెల 10న విడుదల ఆర్థిక శాఖ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులను డంప్ చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గత ఆగస్టులో భారత ప్రభుత్వం యాంటి డంపింగ్ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.