For Money

Business News

జులై 18 తరవాత నిఫ్టి జూమ్

జూన్‌ 18 తరవాత నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతుందని…దాదాపు ఆరు నెలలు మార్కెట్‌ గ్రీన్‌లో ఉంటుందని ఐఎఫ్‌ఎల్‌ఎస్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ అన్నారు. సీఎన్‌బీసీ టీవీ 18తో ఆయన మాట్లాడుతూ.. ఇన్వెస్టర్లు మంచి షేర్లను ఇప్పటి నుంచే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. పలు రంగాలు బాగా రాణిస్తాయని ఆయన అన్నారు. ఇన్వెస్టర్ల కోసం ఆయన కొన్ని షేర్లను సూచించారు. వాటిలో ముఖ్యంగా ఆర్తి ఇండస్ట్రీస్ బాగా రాణిస్తుందని అన్నారు. ఆర్తి ఇండస్ట్రీస్‌ వాడే ముడి పదార్థాల ధరలు బాగా తగ్గాయని అన్నారు. అలాగే కంపెనీ ఉత్పత్తులకు చైనా నుంచి మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఇక హిందుస్థాన్‌ ఏరో నాటిక్స్‌ పనితీరు అద్భుతంగా ఉందన్నారు. పీఎస్‌యూలలో ఈ కంపెనీ బాగా రాణిస్తోందని అన్నారు. ఈ షేర్‌తో పాటు సెయిల్ షేర్‌ను ఆయన రెకమెండ్‌ చేస్తున్నారు. మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్లలో పర్సిస్టెన్స్‌ సిస్టమ్స్‌ రేటుకు మంచి భవిష్యత్తు ఉందని, ఈ షేర్‌ రూ. 5500కు చేరుతుందని అన్నారు. అలాగే జీ ఎంటర్‌టైన్మెంట్‌ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. ఈ కంపెనీలోకి సోని మరిన్ని నిధులు తెస్తుందని , ఈ కంపెనీ త్వరలోనే రుణ రహిత కంపెనీగా మారుతుందని అన్నారు.

ఆయన రెకమెండ్‌ చేసిన షేర్లు…

సెయిల్‌

డాక్టర్‌ పాథ్‌ల్యాబ్స్‌

టీవీఎస్‌ మోటార్స్‌

అశోక్‌ లేల్యాండ్స్‌

ఆర్తి ఇండస్ట్రీస్‌

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌
పర్సిస్టెన్స్‌ సిస్టమ్స్‌