IIFL వెల్త్‌లో బెయిన్ క్యాపిటల్‌కు 25 % వాటా
IIFL వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్‌లో 24.98 శాతం వాటాను రూ.3,679 కోట్లతో కొనుగోలు చేయనున్నట్లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బెయిన్ క్యాపిటల్ వెల్లడించింది. IIFL వెల్త్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (IIFL డబ్ల్యూఎంఎల్)లో జనరల్ అట్లాంటిక్ సింగపూర్ ఫండ్, SIH మారిషస్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్‌లకు ఉన్న 2.2 కోట్ల షేర్లను బెయిన్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయిన బీసీ ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్ లిమిటెడ్ కొనుగోలు చేయనుంది . IIFL వెల్త్ మేనేజ్‌మెంట్‌కు మన దేశంలో 44 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.30 లక్షల కోట్ల) ఆస్తులను నిర్వహిస్తోంది. కంపెనీ వాటాలో 25 శాతం కన్నా తక్కువ వాటాను కొంటున్నందున ఓపెన్ ఆఫర్ జారీ చేయాల్సిన అవసరం లేదు.
