For Money

Business News

Infosys: ఉద్యోగుల వలస రేటు 28.4 శాతం

మధ్యలో ఉద్యోగం మానేస్తున్నవారి సంఖ్య ఇన్ఫోసిస్‌లో కూడా అధికంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా పెరిగింది కూడా. ఐటీ కంపెనీలో టీసీఎస్‌ తరవాత రెండో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ ఇవాళ జూన్‌తో ముగిసిన నెలకు ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ సందర్భంగా గత మూడు నెలల్లో 28.4 శాతం మంది ఉద్యోగులు మానేసినట్లు పేర్కొంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నుంచి ఉద్యోగం మానేసినవారి సంఖ్య 27.7 శాతం. నైపుణ్యమున్న ఉద్యోగుల్లో అధిక పెట్టుబడులు అంటే జీతాలు ఇస్తున్నామని…ఇతర కంపెనీలకు దీటుగా జీతాలను పెంచుతున్నామని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. దీనివల్ల వెంటనే కంపెనీల లాభదాయకత తగ్గినా… ఉద్యోగుల వలస తగ్గుతుందని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్‌ వృద్ధికి ఉపయోగపడుతుందని అంటోంది. ఖాళీ అవుతున్న స్థానాలను ఎప్పటికపుడు భర్తీ చేసుకుంటున్నట్లు పేర్కొంది.

Image Courtesy:TechGig.com