For Money

Business News

ఐసీఐసీఐ బ్యాంక్‌ పనితీరు సూపర్‌

డిసెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 6194 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్‌ ఆర్జించిన రూ. 4,940 కోట్లతో పోలిస్తే ఇది 25 శాతం అధికం. అలాగే కంపెనీ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) కూడా 23 శాతం పెరిగి రూ. 9, 912 కోట్ల నుంచి రూ. 12,236 కోట్లకు పెరిగింది. నెట్‌ ఇంటరెస్ట్‌ మార్జిన్‌ రెండో త్రైమాసికంలో 3.96 శాతం ఉండగా, ఇపుడు 4 శాతానికి పెరిగింది.గత ఏడాదితో పోలిస్తే ప్రొవిజన్స్‌ మొత్తం 27 శాతం తగ్గి రూ. 2742 కోట్ల నుంచి రూ. 2007 కోట్లకు క్షీణించింది. బ్యాంక్‌ వడ్డీ యేతర ఆదాయం (ట్రెజరీ ఆదాయం మినహా) 25 శాతం పెరిగి రూ. 4,899 కోట్లకు చేరింది. ఫీ ఇన్‌కమ్‌ కూడా రూ. 3,601 కోట్ల నుంచి రూ. 4291 కోట్లకు పెరిగింది. ఈ మొత్తంలో రీటైల్‌, బిజినెస్‌, ఎస్‌ఎంఈ రంగాల నుంచి వచ్చిన మొత్తం 76శాతంగా బ్యాంక్‌ పేర్కొంది.