For Money

Business News

గంటలోనే జుమాటో IPO ఫుల్‌

ఊహించినట్లే జుమాటో పబ్లిక్‌ ఆఫర్‌కు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. రూ. 9,375 కోట్లకు పబ్లిక్‌ ఆఫర్‌కు జొమాటొ వచ్చిన విషయం తెలిసిందే. ఎల్లుండి వరకు ఆఫర్‌ ఓపెనై ఉంటుంది. కాని ఇవాళ ఓపెనైన గంటలోనే సాధారణ ఇన్వెస్టర్లకు కేటాయించిన కోటా షేర్లకు వంద శాతం సబ్‌స్క్రిప్షన్‌ వచ్చంది. ఒక ఇతర వర్గాలకు కేటాయించిన షేర్లను కూడా కలుపుకుంటే ఐపీఓలో ఇప్పటి వరకు 20 శాతం సబ్‌స్క్రియిబ్‌ అయింది. ఆఫర్‌ ప్రైస్‌ రేంజ్‌ రూ. 72 నుంచి రూ. 76గా నిర్ణయించిన విషయం తెలిసిందే.