For Money

Business News

హెటిరో డ్రగ్స్‌ …అనధికార ఖజానా

ప్రతిదీ ఆన్‌లైన్‌ అంటోంది ప్రభుత్వం. ప్రధాని మోడీ నోటా ఎపుడూ డిజిటల్‌ మంత్ర… దీనికి బలౌతున్నది ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు. ప్రతి లావాదేవీకి ట్రాన్సాక్షన్‌ ఫీజుతో వీరి జేబులకు చిల్లు పెడుతున్నారు. కాని కార్పొరేట్‌ కంపెనీల దోపిడీ ఈ ఫొటోలో చూపినట్లు ఉంది. కరోనా సమయంలో రెమ్‌డెసివియర్‌ వంటి ప్రాణ రక్షక ఔషధాలను అమ్మిన ఈ కంపెనీ వద్ద లెక్కల్లో చూపని నోట్ల కట్టల ఫొటోలు ఇవి. దాదాపు రూ 142 కోట్లు ఉన్న ఈ నోట్ల కట్లలో డాలర్లు కూడా ఉన్నాయి. మొన్న జరిగిన దాడుల్లో ఈ అక్రమ సంపాదన బయటపడింది. మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ తమను వేధిస్తోందని… తాము నిజమైన పారిశ్రామికవేత్తలమని…. హైకోర్టులో పేర్కొంది హెటిరో డ్రగ్స్‌.