For Money

Business News

హైదరాబాద్‌లో గృహ విక్రయాలు తగ్గాయి

గత జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు పుంజుకున్నాయి. అయితే హైదరాబాద్‌లో మాత్రం తగ్గాయి. ముంబైలో ఇళ్ళ అమ్మకాలు 26 శాతం పెరగ్గా, బెంగళూరులో మూడు శాతం పెరిగాయి. పుణెలో ఇళ్ళ అమ్మకాలు 19 శాతం పెరిగాయి. హైదరాబాద్‌ ఇళ్ళ అమ్మకాలు 15 శాతం తగ్గాయి.గత ఏడాది కాలంతో పోలిస్తే ఏడు శాతం పెరిగి 70,623కు చేరాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్‌ వెల్లడించింది. ‘Real Insight Residential – January-March 2022-2021 పేరుతో నివేదిక విడుదల చేసింది. ఇదే సమయ విక్రయాలు 66,176. ముంబై- మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, అహ్మదాబాద్, బెంగళూరుల్లో గృహ విక్రయాలు పెరగ్గా… దిల్లీ – ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్, కోలకతా నగరాల్లో తగ్గాయి. గృహ రుణాలపై వడ్డీ తక్కువకే ఉండటం ప్రధాన కారణంగా ఈ సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో ధరలు కూడా సగటున 7 శాతం పెరిగినా ఇళ్లు/ప్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడానికి తక్కువ వడ్డీ రేట్లు కారణమని ప్రాప్‌టైగర్‌ పేర్కొంది. డిమాండ్‌తో పాటు నిర్మాణం పూర్తయిన కొత్త ఇళ్ల సరఫరా కూడా 53,037 నుంచి 79,532కు పెరిగిందని తెలిపింది.