For Money

Business News

హౌసింగ్‌: హైదరాబాద్‌ కాస్ట్‌లీ గురూ!

2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో స్థిరాస్తి ధరలు 7 శాతం పెరిగాయని ప్రాప్‌ టైగర్‌ సంస్థ తన తాజా నివేదికలో పేర్కొంది . అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు ధర సగటు రూ.5900 నుంచి రూ. 6100 పలుకుతోందని స్పష్టం చేసింది. దేశంలో ముంబయి తరువాత అత్యంత ఖరీదైన హౌసింగ్‌ మార్కెట్‌గా హైదరాబాద్ నిలిచిందని ప్రాప్‌ టైగర్‌ వెల్లడించింది. ముంబైలో ఇపుడు చదరపు అడుగు ధర రూ 9700 నుంచి రూ. 9900 ఉందని వెల్లడించింది. 2020 తో పోలిస్తే 2021 లో ఇళ్ల విక్రయాల పరంగా 36 శాతం వృద్ధి కనిపించింది . హైదరాబాద్లో 2020లో 16,400 ఇళ్లు/ ఫ్లాట్ల విక్రయాలు జరగ్గా .. 2021లో 22,239 అమ్ముడయ్యాయి . సరఫరా పరంగా హైదరాబాద్లో రెండు రెట్ల వృద్ధి కనిపించింది. 2020 లో 22,490 ఇళ్లు/ఫ్లాట్లు అందుబాటులోకి రాగా .. 2021 లో 48,566 ఇళ్లు వచ్చాయి. పుప్పాలగూడ, మియాపూర్, బాచుపల్లి ప్రాంతాల్లో ఇళ్ల సరఫరా అధికంగా ఉంది . హైదరాబాద్లో అమ్ముడుపోకుండా ఉంటున్న ఇళ్ల సంఖ్య కూడా అదే రీతిలో పెరుగుతోంది. 35 నెలలుగా 65,635 ఇళ్లు / ప్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయి .
ధరలు పెరగుదల
కొత్త అపార్ట్‌మెంట్ల ధరలలో పెరుగుదలకు ప్రధాన కారణంగా నిర్మాణ సామగ్రి రేట్లు పెరగడమేనని ప్రాప్‌ టైగర్‌ అంటోంది. బాచుపల్లి, తెల్లాపూర్, మియాపూర్‌లలో గృహాల కొనుగోలుకు హైదరాబాద్ వాసులు ఇష్టపడుతున్నారని పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన యూనిట్లలో 36 శాతం ఫ్లాట్స్‌ రూ. 1 కోటి కంటే ఎక్కువ ధర రేంజ్‌లో ఉన్నాయని నివేదిక పేర్కొంది .