For Money

Business News

అమ్మకానికి అంబుజా సిమెంట్‌?

దేశంలోనే అతి పెద్ద సిమెంట్‌ కంపెనీ అయిన అంబుజా సిమెంట్‌ అమ్మకానికి పెట్టారా? అలాంటి ప్రయత్నాలు జరుగుతోందని అంటోంది బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ. అంబుజా సిమెంట్‌లో స్విట్జర్‌ల్యాండ్‌కు చెందిన హోల్సిమ్‌కు 63.1 శాతం వాటా ఉంది. కీలక వ్యాపారంపై మరింత దృష్టి సారించాలని… అప్రధాన వ్యాపారాల నుంచి వైదొలగాలని స్విస్‌ కంపెనీ భావిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. అంబుజా సిమెంట్‌ కంపెనీ విలువ రూ. 74,000 కోట్లుగా లెక్కిస్తున్నారు. గుజరాత్‌ అంబుజా అనుబంధ సంస్థ ఏసీసీ కూడా లిస్టెడ్‌ కంపెనీ కావడం విశేషం. గడచిన నెలరోజుల్లో అంబుజా సిమెంట్‌ షేర్‌ 20 శాతం పైగా పెరిగింది. 1983లో ఏర్పాటైన గుజరాత్‌ అంబుజా సిమెంట్‌ కెపాసిటీ ఏడాదికి 3.10 కోట్ల మెట్రిక్‌ టన్నులు. ఈ కంపెనీకి ఆరు ఇంటిగ్రేటెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్లతో పాటు ఎనిమిది సిమెంట్‌ గ్రైండింగ్‌ యూనిట్లు ఉన్నాయి.