హిందూజా గ్లోబల్… నో బయ్యర్
కంపెనీకి ఆయువు పట్టయిన హెల్త్‌కేర్ ఆపరేషన్స్‌ను ఏకంగా రూ. 8150 కోట్లకు అమ్మిన హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ (HGS) తన వాటాదారులకు కేవలం రూ. 315 కోట్ల బదిలీ చేయడంపై ఇన్వెస్టర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఈ కౌంటర్లో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం ఓపెనింగ్‌లోనే 20 శాతం క్షీణించింది.ఇప్పటికీ లోయర్ సీలింగ్ కొనసాగుతోంది. మధ్యంతర డివిడెంట్ కింద షేర్‌కు రూ. 150లను కంపెనీ ప్రకటించింది. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. దీనికి జనవరి 18 రికార్డు తేదీగా పేర్కొంది. దీంతో లోయర్ సీలింగ్ ఇన్వెస్టర్లు షేర్లను కొంటున్నారు. కాని కొనుగోళ్ళు లోయర్ సీలింగ్ ధరవద్దే ఉన్నాయి. కంపెనీ హెల్త్‌కేర్ డివిజన్‌ను అమ్మేయడం వల్ల షేర్‌కు రూ. 4000చొప్పున కంపెనీకి వచ్చాయి. కాని ఇన్వెస్టర్లకు ఆ మేరకు సంపద బదిలీ చేయలేదు. ఇపుడ కంపెనీ షేర్లు 20 శాతం లోయర్ సర్క్యూట్లో రూ. 2,927.80 వద్ద ట్రేడవుతున్నాయి. పైగా వచ్చిన సొమ్మును మ్యూచువల్ ఫండ్లతో పాటు గ్రూప్ కంపెనీలకి బదిలీ చేయడంపై ఇన్వెస్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ కంపెనీ ప్రధాన వ్యాపారం బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ / నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (KPO).డివిడెండ్‌పై ఆశతో ఇన్వెస్టర్లు ఈ షేర్‌ను భారీగా కొనడంతో ధర మంగళవారం రికార్డు స్థాయిలో రూ.3,948కి చేరింది. ఈ షేర్ గత ఒక నెలలోనే 24 శాతం పెరిగింది.