For Money

Business News

MID SESSION: అక్కడి నుంచి పతనం

ఉదయం టెక్నికల్‌ అనలిస్టుల అంచనాలను నిజం చేస్తూ నిఫ్టి 17900 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. ఇవాళ ఉదయం 17797 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత క్రమంగా పెరుగుతూ 17905 పాయింట్లను తాకింది. ఆల్గోట్రేడింగ్‌ ప్రకారం 17870 తరవాత 17920 వద్ద నిఫ్టికి గట్టి ప్రతిఘటన ఎదురువుతుందని అనలిస్టులు హెచ్చరించారు. నిఫ్టి ఇవాళ రెండో ప్రతిఘటన దాటినవెంటనే తిరుగుముఖం పట్టింది. ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి బాగా వచ్చింది. మళ్ళీ నిఫ్టిలో బజాజ్‌ ట్వీట్‌ టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి. అయితే తొలి మద్దుత స్థాయి వరకు పడకుండా 17700 ప్రాంతంలోనే కోలుకుని.. ఇపుడు 15 పాయింట్ల లాభంతో 17761 వద్ద ట్రేడవుతోంది. వడ్డీ రేట్ల ప్రభావం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలపై పడుతోంది. వారాంతంలో నిఫ్టి కోలుకుంటుందా లేదా అన్నది చూడాలి.