For Money

Business News

యాపిల్ ఫోన్ల ధరలు భారీ తగ్గింపు

ఐఫోన్‌ పాత మోడల్స్‌ ధరలను యాపిల్‌ భారీగా తగ్గించింది. 64 జీబీ బేస్‌మోడల్‌ ఐఫోన్‌ 11ను ఇపుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,900 లకు ఆఫర్‌ చేస్తోంది. సాధారణంగా కలర్‌ను బట్టి ఐఫోన్‌ ధర మారుతుంది. కాని అన్ని కలర్స్‌ను ఒకే ధరకు ఆఫర్‌ చేస్తున్నారు. 64జీబీ మోడల్‌ ఐఫోన్‌ 12ను రూ. 53,999లకు, ఊదా రంగు ఉన్న ఫోన్‌ను ఇంకా తగ్గించి రూ. 53,900లకు ఆఫర్‌ చేస్తోంది. 128 జీబీ ఐఫోన్‌ 12ను రూ.64900లకు ఫ్లిప్‌కార్డులో అందజేస్తుండగా, అమెజాన్‌లో రూ. 70,900లకు ఆఫర్‌ చేస్తోంది. ఇక 64 జీబీ బేస్‌ మోడల్‌ ఐఫోన్‌ 12 మినీని ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 40999లకు అమ్ముతున్నారు.