For Money

Business News

ఐబీ రియల్‌ ఎస్టేట్‌ కొనండి

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ జయ్‌ ఠక్కర్‌ జీ బిజినెస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ మూడు షేర్లను.. మూడు భిన్న ఇన్వెస్టర్లకు సూచించారు. దీర్ఘాకాలిక ఇన్వెస్టర్లకు జిందా సా షేర్‌ను ఈయన సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్‌ ప్రస్తుతం రూ.104.75 వద్ద ట్రేడవుతోంది. రూ. 72 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను దీర్ఘకాలానికి (9 నుంచి 12 నెలలు) కొనుగోలు చేయొచ్చని…టార్గెట్‌ రూ.170 అని జయ్‌ ఠక్కర్‌ తెలిపారు. మిడ్‌క్యాప్‌లో మిడ్‌ టర్మ్‌ ఇన్వెస్టర్లకు ఆయన గుజరాత్‌ అంబుజా ఎక్స్‌పోర్ట్స్‌ షేర్‌ను కొనుగోలు చేయమని సలహా ఇచ్చారు. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 171 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌ను రూ. 135 స్టాప్‌లాస్‌తో హోల్డ్‌ చేయొచ్చని… మూడు నుంచి ఆరు నెలల్లోగా ఈ షేర్‌ రూ. 240 లేదా రూ. 260కి చేరుతుందని ఆయన చెప్పారు.ఇక స్వల్ప కాలానికి ఆయన ఇండియా బుల్స్‌ రియల్ ఎస్టేట్‌ షేర్‌ను సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 164.95 వద్ద ట్రేడవుతోంది. నెల లేద మూడు నెలల్లోగా ఈ షేర్‌ రూ. 196కు చేరే అవకాశముందని, స్టాప్‌ లాస్‌ రూ.154గా ఉంచుకుని ఈ షేర్‌లో ట్రేడ్‌ చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు.