ఆ హిమాలయ యోగి ఎవరో తేలింది!
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను హిమాలయాల్లోని యోగి ఎవరో తేలిపోయింది. ఎన్‌ఎస్‌ఈ అక్రమాలపై ఇటీవల సెబి చిత్ర రామకృష్ణతో పాటు పలువురిపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నివేదికలోనే ఓ యోగి ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని తేలింది. ఆ యోగి చెప్పడం వల్లనే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఆనంద్ సుబ్రమణియంను చిత్ర నియమించారు. నిబంధలనకు విరుద్ధంగా అతన్ని నియమించడమేగాకుండా… అతనికి ప్రమోషన్లు ఇచ్చి కోట్ల జీతం ఇచ్చాడు. ఈ కేసులో భారీగా లబ్ది పొందిన ఆనంద్ సుబ్రమణియం ఆ హిమాలయ యోగి అని సీబీఐ విచారణలో తేలింది. rigyajursama@outlook.com ఈ మెయిల్ ఈడీని ఈయనే సృష్టించాడని పేర్కొంది. ఎన్‌ఎస్‌ఈ తీసుకున్న పలు కీలక నిర్ణయాలను చిత్ర రామకృష్ణ తన ఈ మెయిల్ ఐడి rchitra@icloud.com ద్వారా యోగికి తెలిపారు. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజుల నుంచి చెన్నైలో సుబ్రమణియంను సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. అతన్ని ఇవాళ అరెస్ట్ చేసి.. ఢిల్లీకి తీసుకెళ్ళారు.