For Money

Business News

క్రిప్టోలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీం

దేశంలో బిట్‌కాయిన్‌ వంటి క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధమా? కాదా? స్పష్టం చేయాలని కేంద్రానికి సుప్రీం కోర్టు పేర్కొంది. 87,000 బిట్‌ కాయిన్‌లకు సంబంధించి అంటే రూ. 20,000 కోట్ల క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. అయితే కోర్టు ఈ వ్యాఖ్యలను మౌఖికంగా చేసిందే కాని…రాతపూర్వకంగా ఆదేశాలు ఇవ్వలేదు. 2018లో గెయిన్‌ బిట్‌కాయిన్‌కు సంబంధించి అమిత్‌ భరద్వాజను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నమోదు చేశారు. ఈకేసుకు సంబంధించి 2019 ఏ్రపిల్‌లో అమిత్‌కు కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఆయన సోదరుడు అజయ్‌ భరద్వాజ్‌… ఈడీ తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనను అరెస్ట్‌ చేయొద్దని గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇవాళ మళ్ళీ సదరు కేసు విచారణకు వచ్చింది. బిట్‌ కాయిన్‌పై ప్రభుత్వ వైఖరి తేలాల్సి ఉందని అంటూ మరో నాలుగు వారాలు అజయ్‌ మిశ్రాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు ఆదేశించింది.