For Money

Business News

ఐఆర్‌సీటీసీ నిలబడుతుందా?

తను వసూలు చార్జీల్లో 50 శాతం తనకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీకి లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న షేర్‌ విభజనతో 15 శాతం పెరిగిన ఐఆర్‌సీటీసీ షేర్‌ ఇవాళ నిలబడుతుందా అన్నది చూడాలి. చాలా మందికి నిన్న విభజన తరవాత షేర్లు అలాట్ అయినప్పటికీ… వారి అకౌంట్స్‌లో చూపలేదు. దీంతో చాలా మంది అమ్మలేకపోయారు. కాని మార్కెట్‌లో అనుభవం ఉన్నవారు నిన్న భారీగా అమ్మారు. అలాగే మరికొందరు ఫ్యూచర్స్‌ అమ్మారు. తమ అకౌంట్‌లో షేర్లు లేవని.. అమ్మనివారు ఇవాళ ఏమాత్రం నష్టపోతారో చూడాలి. ఇక ఎం అండ్ ఫైనాన్షియల్‌లో అమ్మకాల ఒత్తిడి రావొచ్చని తెలుస్తోంది.అలాగే నష్టపోయే షేర్లలో ఆర్బీఎల్‌ బ్యాంక్‌ ఉంది. సేమ్ ఎన్‌టీపీసీ. చాలా షేర్లు ఇవాళ నష్టాల్లో ప్రాంభమయ్యే అవకాశముంది.