For Money

Business News

టెక్‌ షేర్లకు భారీ నష్టాలు

వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ఉంది. ముఖ్యంగా టెక్‌, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. చైనా నుంచి పోటీ తీవ్రం కావడంతో టెస్లా షేర్లలో ఒత్తిడి వస్తోంది. ఇక బార్కలేస్‌ బ్రోకింగ్ సంస్థ యాపిల్‌ షేర్లకు సెల్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఈ షేర్‌ అయిదు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. వెరశి నాస్‌డాక్‌ ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.64 శాతం నష్టంతో ఉంది. డౌజోన్స్‌ మాత్రం క్రితం ముగింపు వద్ద ట్రేడవుతోంది. డాలర్‌ క్రమంగా బలపడుతూ 102 ప్రాంతానికి చేరువ అవుతోంది. బులియన్‌, క్రూడ్‌ ధరల్లో పెద్దగా మార్పు లేవు. బ్రెంట్ క్రూడ్‌ 76 డాలర్ల ప్రాంతంలో ఉంది.