For Money

Business News

ఇంటి రుణాలపై వడ్డీ రేటు పెంపు

దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే పెంచాల్సింది. అయితే పారిశ్రామిక రంగం కోసం పెంచలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో బ్యాంకులు ఆర్బీఐ నిర్ణయం కోసం వేచి చూడకుండా రుణాలపై వడ్డీ రేట్లను పెంచతున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ 0.1 శాతం మేర MCLR(మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్‌)ను పెంచింది. తాజాగా హౌసింగ్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ (HDFC) తాజాగా ఐదు బేసిక్ పాయింట్లు రీటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (RPLR) పెంచుతున్నట్లు ప్రక‌టించింది. దీంతో రుణాలపై వ‌డ్డీరేట్ల పెంపు వెంటనే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని HDFC తెలిపింది. దీంతో ఈఎంఐలు పెరుగుతాయి.