226 శాతం పెరిగిన నికర లాభం
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3593 కోట్లు కాగా, గత ఏడాది ఇదేకాలంలో నికర లాభం రూ. 1,102 కోట్లు. అంటే 226 శాతం పెరిగిందన్నమాట. ఈటీ నౌ ఛానల్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న విశ్లేషకులు రూ.3350 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు.కంపనీ ఆదాయం కూడా 15.05శాతం పెరిగి రూ. 22,597 కోట్ల నుంచి రూ. 19641 కోట్లకు చేరింది. నిజానికి డిఫర్డ్ ట్యాక్స్ క్రెడిట్, వన్‌టైమ్ స్పెషల్ బోనస్‌లను గత ఏడాదికి వర్తింప జేస్తే… గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికరలాభం రూ. 2962 కోట్లుగా తేలుతుంది. ఆ లెక్కన చూస్తే నికర లాభం 21.3 శాతం పెరిగినట్లు. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో నికర లాభం 4.4 శాతం పెరిగింది. పూర్తి ఏడాదికి అంటే 2021-22కి చూస్తే కంపెనీ నికర లాభం 21 శాతం పెరిగి రూ. 11,145 కోట్ల నుంచి రూ. 13,999 కోట్లకు చేరింది. అలాగే ఆదాయం కూడా 13.6 శాతం పెరిగి రూ. 75,379 కోట్ల నుంచి రూ. 85651 కోట్లకు పెరిగింది.