వజీరెక్స్పై జీఎస్టీ అధికారుల సోదాలు!
దేశవ్యాప్తంగా ఉన్న పలు క్రిప్టోకరెన్సీ సర్వీస్ ప్రొవైడర్ వజీరెక్స్ కార్యాలయాల్లో ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ)’ అధికారులు నిన్నటి సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఈ కంపెనీ జీఎస్టీ ఎగవేసినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలపై 18 శాతం జీఎస్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది.
జీఎస్టీ ముంబయి ఈస్ట్ కమిషనరేట్ అధికారులు సోదాలు జరిపారు. దాదాపు రూ.40.5 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించారు. పన్ను ఎగవేత, వడ్డీ, అపరాధ రుసుముతో కలిపి రూ.49.20 కోట్లు వసూలు చేశారు. క్రిప్టో కరెన్సీ సేవలు అందిస్తున్న బిట్సైఫర్ ల్యాబ్స్ ఎల్ఎల్పీ (కాయిన్‌స్విచ్ కుబేర్), నెబ్లియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (కాయిన్ డీసీఎక్స్),ఐ బ్లాక్ టెక్నాలజీస్ (బై యూ కాయిన్)తో పాటు యూనొకాయిన్ టెక్నాలజీస్ (యూనోకాయిన్)లపై కూడా దాడులు చేసి రూ 30 కోట్లను వసూలు చేశారు.