For Money

Business News

గ్రాసిం లాభం 55 శాతం జంప్‌

మార్చి త్రైమాసికంలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ రూ.4.070.46 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.2.616.64 కోట్లు. ఈ లెక్కన నికరలాభం ఏకంగా 55 శాతం పైగా పెరిగింది.అధికం. కంపెనీ ఆదాయం కూడా 18.07 శాతం పెరిగి రూ.24,401.45 కోట్ల నుంచి రూ .28,811.39 కోట్లకు చేరింది. ఇక పూర్తి ఏడాదికి చూస్తే 2021-22లో ఏకీకృత నికర లాభం రూ.11.206.29 కోట్లకు చేరింది. క్రితం ఏడాది నికరలాభం రూ .6,986.70 కోట్లతో పోలిస్తే ఇది 60.39 శాతం అధికం. టర్నోవర్‌ కూడా 25.25 శాతం పెరిగి రూ . 76,404.29 కోట్ల నుంచి రూ .95,701.13 కోట్లకు చేరింది. పెయింట్‌ పరిశ్రమలో ప్రవేశిస్తున్న ఈ కంపెనీ రూ .10,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 2024 ఆరంభంలో ఈ యూనిట్‌ ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. రూ .10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ .5 డివిడెండ్‌త పాటు మరో రూ .5 ప్రత్యేక డివిడెండు (మొత్తం రూ .10 ) ఇచ్చేందుక డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.