తగ్గిన గ్రాన్యూల్స్ తగ్గిన లాభం
డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గ్రాన్యూల్స్ ఇండియా నికర లాభం 31 శాతం క్షీణించి రూ.101 కోట్లుకు చేరింది. 2020 ఆర్థిక సంవత్సరం త్రైమాసికంతో నికర లాభం రూ.147 కోట్లు. ఆదాయం మాత్రం 18 శాతం పెరిగి రూ.845 కోట్ల నుంచి రూ.997 కోట్లకు పెరిగింది. ముడి సరుకుల ధరల పెరుగుదల, చైనా నుంచి సరఫరాల్లో అనిశ్చితి వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ ఆదాయపరంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు సంస్థ సీఎండీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటి తెలిపారు. మున్ముందు పరిస్థితి బాగు పడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.