For Money

Business News

సువెన్‌ ఫార్మా నికర లాభం రూ. 137 కోట్లు

గత డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సువెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ స్టాండలోన్ ప్రాతిపదికన రూ.400 కోట్ల ఆదాయంపై రూ.137 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2020-21 ఇదేకాలంలో రూ.297.77 కోట్ల ఆదాయంపై నికరలాభం రూ.97.63 కోట్లు. త్రైమాసిక ఈపీఎస్ రూ .5.38 ఉంది . ఒక్కో షేరుపై రూ .1 మధ్యంతర డివిడెండ్‌ను, రూ .2 చొప్పున ప్రత్యేక డివిడెండ్ ఇవ్వాలని సువెన్ ఫార్మా ప్రతిపాదించింది. దీనికి ఈ నెల 16 వ తేదీని రికార్డు తేదీగా నిర్ణయించారు.