For Money

Business News

ఐపీఓకు ఐనాక్స్ గ్రీన్

ఐనాక్స్ విండ్ అనుబంధ సంస్థ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ రానుంది. మార్కెట్‌ నుంచి రూ . 740 కోట్ల సమీకరించేందుకు సమాయాత్తమౌతోంది. ఈ మేరకు సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ప్రతిపాదిత ఇష్యూలో రూ .370 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేస్తారు. ఈ కంపెనీ తనకు ఉన్న షేర్లలో రూ .370 కోట్ల విలువైన షేర్లను ఐనాక్స్ విండ్‌ అమ్ముతోంది. ఇష్యూ నిధుల్లో రూ.140 కోట్లను రుణాలు చెల్లించేందుకు, రూ.120 కోట్లను డిబెంచర్ల చెల్లింపులకు ఉపయోగిస్తారు. మిగిలిన మొత్తాన్ని కంపెనీ అవసరాల కోసం ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ వినియోగించనుంది.