For Money

Business News

అప్పు చేయం… ఆస్తులు అమ్ముతాం

పెట్రోల్‌,డీజిల్‌లపై ఎక్సైజ్‌ సుంకం తగ్గించడం, PMGKY కింద లబ్దిదారులకు ఎల్‌పీజీ గ్యాస్‌పై రూ. 200 సబ్సిడీ ఇవ్వడం వల్ల ఖజానాపై రూ.1.2 లక్షల కోట్ల భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు మార్కెట్‌ నుంచి రుణాలు తెస్తామని ఆర్థిక శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. రుణాలకు బదులు రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని భావిస్తున్నారు. రెండు పీఎస్‌యూ బ్యాంకులను ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. అలాగే ప్రభుత్వ స్థాలాలను లీజులకు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉంది. దీన్ని ఇపుడు కేంద్రం అమలు చేయనుంది. కీలక ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వం భూములన్నీ ఇక ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లోకి వెళతాయన్నమాట.