వారంలో లీటరు రూ. 10 తగ్గించండి
వంటనూనెల ధరలను వారంలో లీటరుకు రూ.10 చొప్పున తగ్గించాలని కంపెనీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకే బ్రాండ్ ఆయిల్ దేశ వ్యాప్తంగా ఒకే ధర ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెల ధరలు తగ్గినా..మన దేశంలో అధికంగా ఉండటంపై కేంద్రం స్పందించింది. మన అవసరాల్లో 60 శాతం నూనెను దిగుమతి చేసుకుంటాం. అలాంటి సమయంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినపుడు మన దేశంలో కూడా తగ్గాలికదా అని ప్రశ్నిస్తోంది కేంద్రం. గత నెలలో కూడా కంపెనీలు వంటి నూనెల ధరలను లీటరుకు రూ.10 నుంచి రూ. 15 వరకు తగ్గించాయి. వివిధ వంటనూనెల తయారీదారులు, కంపెనీల అసోసియేషన్లతో కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాంశు పాండే భేటీ అయ్యారు. ఈ సమాశంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గిన విషయాన్ని వివరిస్తూ వారంలోగా లీటరుకు రూ.10 తగ్గించాలని ఆదేశించారు,