For Money

Business News

ఇవాళే రూ.2,118 పెరిగిన బంగారం

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. దీంతో మార్కెట్‌ అంచనాలకు భిన్నంగా స్టాక్‌ మార్కెట్‌ పడుతోంది. అమెరికా ఫ్యూచర్స్‌ ఏకంగా 2.5 శాతం నష్టంతో ఉంది. ఇక యూరియన్‌ మార్కెట్లు సరేసరి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత సాధనాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే ఈక్విటీ మార్కెట్‌ నుంచి బయటపడిన ఇన్వెస్టర్లు బంగారం, డాలర్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా డాలర్‌ బలపడింది. డాలర్ ఇండెక్స్‌ 1శాతం పైగా పెరిగి 97 దాటింది. దీంతో ఇప్పటికే పెరుగుతున్న బులియన్‌కు డాలర్ బలం మరింత కలిసి వచ్చింది. దీంతో భారత్‌ వంటి మార్కెట్‌లో బులియన్‌ ధరలు డబుల్‌ ఎఫెక్ట్‌తో పెరుగుతున్నాయి. ఇవాళ ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో బంగారం రూ.2118 పెరిగి రూ. 52,497లకు చేరింది. వెండి కూడా రూ. 2860 పెరిగి రూ. 68,412కు చేరింది. స్పాట్‌ మార్కెట్‌లో కూడా బంగారం ఇదే స్థాయిలో పెరిగింది.