For Money

Business News

మళ్ళీ తగ్గిన బులియన్‌ ధరలు!

కాస్త పెరిగిన వెంటనే బులియన్‌పై ఒత్తిడి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ డాలర్ స్థిరంగా ఉన్నా బంగారం, వెండి ధరలు క్షీణిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు అమెరికా మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1914 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి 24.81 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఒక శాతం దాకా తగ్గగా, వెండి రెండు శాతం క్షీణించింది. అదే ట్రెండ్‌ మన మార్కెట్‌లో కన్పిస్తోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్‌)లో గోల్డ్ ఫ్యూచర్స్ ఏప్రిల్‌ నెటా కాంట్రాక్ట్‌ ధర (10 గ్రాములు) రూ. 492 తగ్గి రూ.51,163 వద్ద ట్రేడవుతోంది. వెండి ఫ్యూచర్స్ ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ ధర ఎమ్‌సీఎక్స్‌లో కిలోకు రూ. 968 తగ్గి రూ.67,552 వద్ద ట్రేడవుతోంది. ఇదె ట్రెండ్‌ కొనసాగితే బంగారం ధర రూ. 51000 లోపు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి.