For Money

Business News

ఒక్క సెషన్‌లో రూ.712 జంప్‌

ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు మళ్ళీ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. షేర్‌ మార్కెట్లు నష్టపోతుండగా, కరెన్సీ మార్కెట్లలో డాలర్‌ బలపడుతోంది. సాధారణంగా డాలర్‌ బలపడినప్పుడల్లా క్షీణించాల్సిన బంగారం ఇవాళ ఉక్రెయిన్‌ యుద్ధ భయాల కారణంగా పెరుగుతోంది. సురక్షిత పెట్టుబడిగా ఇన్వెస్టర్లు బంగారంలో ఇన్వెస్ట్‌ చేయడమే దీనికి కారణం. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం ధర 1898.80 డాలర్లను చేరింది. వెండి మాత్రం స్వల్పంగా పెరిగి 23.82 డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్, బులియన్‌ కూడా పెరగంతో దేశీయ మార్కెట్‌లో బంగారం పరుగులు పెడుతోంది. ఎంసీఎక్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో పది గ్రామలు స్టాండర్డ్‌ బంగారం (ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌) రూ.712 పెరిగి రూ.50,339కి చేరింది. ఇక వెండి కూడా రూ. 623 పెరిగి రూ. 63,922కు చేరింది.